మంచి రోజుల కోసం ప్రజల ఎదురుచూపు : శ్రీనివాసులు 1 y ago
AP : వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలు మరిచిపోరన్నారు వైసీపీ నేత కొరుముట్లు శ్రీనివాసులు. 2024 ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన బూటకపు హామీలు, ఈవీఎంల ట్యాంపరింగ్‌ను ప్రజలు గుర్తు పెట్టుకుంటారని విమర్శించారు. మళ్లీ మంచి రోజులు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాయలసీమలో వైఎస్సార్ అనేక నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి నీరందించారని తెలిపారు.